నవతెలంగాణ కంటేశ్వర్
చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు మూడవ పోలీస్స్టేషన్ ఎస్ఐ సంతోష్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఎస్సై సంతోష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గుర్తు తెలియని మగ వ్యక్తి వయసు సుమారు 30 సంవత్సరాలు గల వ్యక్తి జనవరి 10వ తేదీ నాడు నగరంలోని కంటేశ్వర్ ప్రాంతంలో గల ఎం.ఎస్.ఆర్ గ్రౌండ్ సమీపంలో సృహతప్పి పడి పోయి, ఉండగా అతని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి ఆసుపత్రిలో అడ్మిట్ చేయగా చికిత్స పొందుతూ అట్టి వ్యక్తి జనవరి 13న రోజున చనిపోయినాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు అట్టి వ్యక్తి గురించి రానందున, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలియజేశారు. ఇట్టి గుర్తుతెలియని వ్యక్తి వివరాలు ఎవరికైనా తెలిసినచో త్రీటౌన్ ఎస్.ఐ నెంబర్ 9440795416 లేదా 08462220350 తెలియజేయాలన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 15 Jan,2021 09:03PM