ఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలపై రైతులు, కేంద్రం మధ్య 9వ విడత చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాల నేతలు మరోసారి స్పష్టం చేశారు. అయితే అందుకు నిరాకరించిన ప్రభుత్వం.. రైతులు పట్టువిడుపులు ప్రదర్శించాలని కోరింది. చట్టాల్లో సవరణలకు సిద్ధమని తెలిపింది. ఈ నేపథ్యంలో మరోసారి జనవరి 19న సమావేశం కావాలని ఇరు పక్షాలు నిర్ణయం తీసుకున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm