నల్గొండ: నల్గొండ జిల్లాలో రేపు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్య శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గొర్రెల పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యా సాగర్, రాష్ట్ర పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కె. తారక రామారావు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డి, రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన నున్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్డులో గల ఎస్.ఎల్ బి.సి. బత్తాయి మార్కెట్ లో గొర్రెల పంపిణీకి చేయాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనీ ప్రతిమా సింగ్, ఆర్.డి. ఓ. జగదీశ్వర్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ అధికారి డా.శ్రీనివాస్, డి.పి.ఆర్.ఓ. శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, తహసీల్దార్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm