ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గుడిసెకు నిప్పంటుకుని ఓ వృద్ధురాలు సజీవ దహనమైంది. ఈ సంఘటన ఇంద్రవెల్లి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇంద్రవెల్లి మండలం హిరాపూర్ గోపాలపూర్ శివారులో ఓ వృద్ధురాలు గుడిసెలో నివాసం ఉంటోంది. శుక్రవారం గుడిసెలో ఉన్న పత్తికి నిప్పంటుకోవటంతో.. ఆ అగ్ని కీలలు గుడిసెకు ఎగబాకాయి. దీంతో గుడిసె మొత్తం పెద్ద మంటతో తగలబడిపోయింది. మంటలలో చిక్కుకోని వృద్ధురాలు మాంసపు ముద్దగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వంట చేస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించిదని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 15 Jan,2021 06:36PM