హైదరాబాద్: కుటుంబ కలహాల కారణంగా మహిళ అదృశ్యం అయింది. ఈ ఘటన అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్ అంబర్‌పేటలో చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ నెల 13న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు మూడురోజులుగా బంధువులు, తెలిసిన వారి ఇండ్లలో ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. దీంతో నేడు అంబర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి ఆచూకీ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm