హైదరాబాద్: ఇండోనేసియాను భారీ భూకంపం కుదిపేసింది. శుక్రవారం తెల్లవారుజామున సంభవించిన ఈ భూకంపం దాటికి సులవేసి దీవిలో 6.2 తీవ్రతతో భూమి కంపించింది. స్థానిక కాలమానం ప్రకారం.. అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత భూకంపం సంభవించింది. 6.2 తీవ్రతతో దాదాపు 7 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఇప్పటివరకు ఏడుగురు చనిపోగా.. వందల మంది గాయపడ్డారు. భవన శిథిలాల కింది అనేక మంది చిక్కుకుపోయారు. దీంతో కొందరు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం ధాటికి కనీసం 60 భవనాలు కుప్పకూలినట్లు ఇండోనేసియా డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ వెల్లడించింది. ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూకంపం సంభవించడంతో చాలా మంది శిథిలాల కిందే చిక్కుకుపోయారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా.. గురువారం కూడా ఇదే ప్రాంతంలో 5.9 తీవ్రతతో భూమి కంపించింది. ఇక్కడ గడిచిన 24 గంటల్లో పలుసార్లు భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో మూడు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
నేలమట్టమైన ఆసుపత్రి భవనం
భూకంపం తీవ్రతకు పలు నివాస సముదాయాలతో పాటు హోటళ్లు, ఓ ఆసుపత్రి కూడా నేలమట్టమయ్యాయి. ఆసుపత్రి కూలిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు రోగులు, హాస్పిటల్ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 15 Jan,2021 10:12AM