హైదరాబాద్: షార్ట్ సర్క్యూట్ కారణంగా న్యూఢిల్లీలో సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నర్సింగ్ గదిలో గురువారం మధ్యాహ్నం స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పడానికి ఫైర్ ఇంజన్లను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారి తెలిపారు. మధ్యాహ్నం 1.24 గంటల సమయంలో ఈ సంఘటన గురించి వారికి కాల్ వచ్చిందని అగ్నిమాపక శాఖతెలిపింది. ఆసుపత్రి నాలుగో అంతస్తులో ఉన్న ఒపిడి బ్లాక్‌లో నర్సింగ్ సిబ్బంది ఉపయోగించిన గదిలో మంటలు చెలరేగాయి.ఏడు ఫైర్ టెండర్లను అక్కడికి తరలించగా, మధ్యాహ్నం 1.40 గంటలకు మంటలను అదుపులోకి తెచ్చినట్లు ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. అగ్ని కారణం ఏమిటో నిర్ధారించబడుతోంది. షార్ట్ సర్క్యూట్ ఈ సంఘటనకు దారితీసిందని అధికారులు అనుమానిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm