హైదరాబాద్: ప్రయాణిస్తున్న రైలు నుంచి భార్యను కిందకు తోసేశాడు భర్త. మహారాష్ట్రలోని ముంబైలో ఈ ఘటన జరిగింది. అదే రైలులో ఉన్న ఓ మహిళా ప్రయాణికురాలు రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో వారు నిందితుడిని అరెస్ట్ చేశారు. నగరంలోని చెంబూరు, గోవండి రైల్వే స్టేషన్ల మధ్య ఈ దుర్ఘటన జరిగింది. భార్యాభర్తలు తమ ఏడేళ్ల చిన్నారితో లోకల్ రైలులో చెంబూరు నుంచి గోవండి వెళ్తున్నారు. ఇద్దరు రైలు తలుపు వద్ద బయటికి లోపలికి ఊగుతూ కాసేపు గడిపారు. భార్య తలుపు బయటికి ముఖం పెట్టబోతుండగా ఆమె చెయ్యి పట్టుకుని ఆపాడు భర్త. తలుపు బయటికి ఉన్న ఆమెను అంతలోనే వదిలేశాడు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 14 Jan,2021 05:08PM