కామారెడ్డి: రాష్ట్రంలో పులులు, చిరుతలు ప్రజలను వణికిస్తున్నాయి. వివిధ జిల్లాల్లో చిరుతల సంచారం ఎక్కువైంది. మాచారెడ్డి మండలం సిగరాయిపల్లిలో చిరుత కలకలం రేగింది. గ్రామ శివారులో రెండు ఆవు దూడలను చంపి చిరుత ఈడ్చుకెళ్లింది. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుత సంచారంతో గ్రామస్థులతో సహా స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. చిరుత సంచారంతో పంట పొలాలకు వెళ్లాలంటే స్థానికులు వణుకిపోతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm