హైదరాబాద్: ఈ రోజుల్లో ‘ఫుడ్ యాప్స్’లో నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేయడం కామన్. అయితే, ఎప్పుడైనా మీరు ఆర్డర్ చేసినా దానికన్నా ఎక్కువ ఫుడ్ పొందారా? డబ్బులు పే చేయకముందే ఆర్డర్ ఓకే అయ్యిందా? అంటే రెగ్యులర్‌గా జరగకపోవచ్చు గానీ సిస్టమ్, ఇంటర్నెట్, యాప్ ప్రాబ్లెమ్స్ వల్ల ఎప్పుడైనా ఓ సారి జరుగుతుంటాయి. కొన్ని సార్లు ఊహించిన దాని కంటే భిన్నంగా వచ్చిన సందర్భాలు, మోసపోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. కానీ ఫిలీప్పీన్స్‌లో వీటన్నిటికీ విభిన్నంగా ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఫిలీప్పీన్స్‌లో ఒక ఆర్డర్‌కు ఏకంగా 42 మంది డెలివరీ బాయిస్ ఆహారాన్ని తీసుకురావడం. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఫిలీప్పీన్స్‌లోని సెబూ సిటీలో స్కూలులో చదువుతున్న ఒక అమ్మాయి ఒక ఫుడ్ యాప్ సాయంతో లంచ్ ఆర్డర్ చేసింది. తరువాత తన నాయనమ్మతో కలిసి ఆహారం కోసం ఎదురు చూస్తోంది. ఇంతలో ఆమె ఆర్డర్ చేసిన ఆహారాన్ని తీసుకుని ఏకంగా 42 మంది డెలివరీ బార్సు తలుపు తట్టారట! ఇంతమంది ఒకేసారి రావడంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారట. ఈ ఉదంతాన్ని చూస్తున్న ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. ఇంతకీ ఇంతమంది డెలివరీ బార్సు ఎందుకొచ్చారా? అనే సందేహం రాకమానదు.. దానికీ కారణముందండోరు.. అమ్మాయి ఆర్డర్ చేసిన ఫుడ్ యాప్‌లోని సాంకేతిక లోపం కారణంగా ఇలా జరిగిందట. ఆ యాప్ సరిగా పనిచేయక ఒక డెలివరీ బారుకి చేరాల్సిన మెసేజ్ ఏకంగా 42 మందికి చేరిందట. దీంతో వారంతా ఆహారం తీసుకుని ఆమె ఇంటికి తరలి వచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm