హైదరాబాద్ : బురేవి తుపాను కారణంగా తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తీరప్రాంతంలోని లోతట్టు గ్రామాలు నీటమునిగాయి. కాలనీల్లోకి నీరు చేరి జనజీవనం స్తంభించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన బురేవి తుపాను.. తీరం దాటిన క్రమంలో తమిళనాడు, పుదుచ్చేరిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తమిళనాడులోని రామేశ్వరం తీర ప్రాంతంలోని వివిధ గ్రామాలు నీటమునిగాయి. నటరాజపురమ్ ప్రాంతంలో ఇళ్లల్లోకి నీరు చేరి జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm