హైదరాబాద్ : కృష్ణా జిల్లా గన్నవరం పాత స్టేట్‌బ్యాంక్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని తూర్పు గోదావరి జిల్లా ఉండి సమీపంలోని కొత్తపేట వాసులుగా పోలీసులు గుర్తించారు. చెన్నై నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. నిద్రమత్తులో ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm