హైదరాబాద్ : సుమారు 200కు పైగా దక్షిణాది భాషల చిత్రాల్లో నటించిన సీనియర్ నటి జయచిత్ర భర్త గణేశ్ తమిళనాడులోని తిరుచ్చిలో మరణించారు. గుండెపోటుతో ఆయన కన్నుమూశారని కుటుంబీకులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో జన్మించిన జయచిత్ర తమిళంలో 70, 80 దశకాల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో హీరోయిన్ గా నటించి టాప్ హీరోయిన్లలో ఉన్నారు. 1983లో ఆమెకు వ్యాపారవేత్త గణేశ్ తో వివాహం జరిగింది. వారి కుమారుడు అమ్రేశ్ ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్నాడు. కాగా, గణేశ్ మృతదేహాన్ని చెన్నైలోని పోయిస్ గార్డెన్ లో ఉన్న స్వగృహానికి తరలించారు. ఆయన అంత్యక్రియలు నేడు జరుగనుండగా, పలువురు సినీ ప్రముఖులు జయచిత్రకు సంతాపాన్ని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm