హైదరాబాద్ : మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు దారుణంగా కొట్టుకున్నారు. వివరాల ప్రకారం.. విశాఖ కూర్మన్నపాలెంలో మద్యం మత్తులో ఇద్దరు లారీ డ్రైవర్ల మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. డ్రైవర్ జ్యోతుల మల్లికార్జునరావుపై మరో డ్రైవర్ దుర్గాప్రసాద్ కత్తితో దాడి చేశాడు. సమాచారం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు లారీ డ్రైవర్ దుర్గాప్రసాదును అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm