హైదరాబాద్ : ఏపీలో దిశ బిల్లు-2020కి రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటు ద్వారా ఈ బిల్లుకు ఆమోదం లభించింది. రాష్ట్రంలో మహిళలు, పిల్లలపై నేరాల నియంత్రణ, త్వరితగతిన శిక్ష పడటం కోసం ఉద్దేశించిన బిల్లును తీసుకువచ్చారు. మొదటి ఈ బిల్లును ఏపీ శాసనసభ నుంచి కేంద్రం అనుమతి కోసం పంపారు. కేంద్రం కొన్ని మార్పులను సూచించింది. కేంద్రం సూచనల మేరకు సవరించిన బిల్లు శుక్రవారం శాసనసభలో ఆమోదం పొందింది. దీని ప్రకారం మహిళలు, చిన్నారులపై లైంగిక దాడి జరిగినప్పుడు 7 పనిదినాల్లో విచారణ, 14 పనిదినాల్లో ఛార్జిషీట్ దాఖలు చేయాలి.
Mon Jan 19, 2015 06:51 pm