హైదరాబాద్ : 2020-21 ఆర్థిక సంవత్సరానికి పరిశ్రమల సమాఖ్య, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) అధ్యక్షుడిగా ఉదయ్ శంకర్‌ను ఎన్నుకున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం వాల్ట్ డిస్నీ కంపెనీ ఫర్ ఆసియా పసిఫిక్ అధ్యక్షుడు, స్టార్ అండ్ డిస్నీ ఇండియా ఛైర్మన్‌గా ఉన్నారు ఉదయ్ శంకర్. ఈ నెల 11-14 తేదీల్లో జరగబోయే ఫిక్కీ 93వ వార్షిక సాధారణ సమావేశంలో(ఏజీఎమ్) ఫిక్కీ ప్రస్తుత ప్రెసిడెంట్, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ సంయుక్త మేనేజిగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి నుంచి శంకర్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఉదయ్ శంకర్ ప్రస్తుతం ది వాల్ డిస్నీ కంపెనీ(ఆసియా-పసిఫిక్) ప్రెసిడెంట్, స్టార్, డిస్నీ ఇండియా ఛైర్మన్గా కొనసాగుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm