హైదరాబాద్: బ్రెజిల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపు తప్పి వంతెనపై నుంచి పడిపోయింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. 20 మందికి పైగా గాయపడ్డారు. మినాస్ గెరైస్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగిందని ఫెడరల్ హైవే పోలీసులు తెలిపారు. 15 మీటర్ల దిగువన గల రైలు పట్టాలపై పడగా.. బస్సు దగ్ధమయినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. పిరాసిబాకా నది పక్కన ఈ ప్రమాదం జరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm