హైదరాబాద్ : కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం మరోసారి వారితో నేడు చర్చలు జరపనుంది. కేంద్రం ఇప్పటికే రెండు విడతల్లో చర్చలు జరిపినప్పటికీ అవి కొలిక్కిరాలేదు. సాగు చట్టాలపై ప్రభుత్వం ఇచ్చిన వివరణను రైతులు తిరస్కరించారు. చట్టాలు రైతు వ్యతిరేకమని, వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని గత సమావేశాల్లో డిమాండ్ చేశారు. కేంద్రం.. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఈ మూడు చట్టాలను రద్దు చేయాలని కోరారు. ఇవాళ జరిగే సమావేశంలోనైనా ఏదో ఒక నిర్ణయం వెలువడుతుందని అన్నదాతలు భావిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం దిగిరాకపోతే ఈ నెల 8న భారత్ బంద్ నిర్వహించాలని రైతునాయకులు నిర్ణయించారు. ఆ రోజు ఢిల్లీని ఎక్కడికక్కడ దిగ్బంధం చేసి రాకపోకలను నిలిపివేస్తామని హెచ్చరించారు. శనివారం ప్రధాని దిష్టి బొమ్మలను దహనం చేస్తామని చెప్పారు. ఇవాళ రైతులకు మద్దతుగా పంజాబ్, హర్యానకు చెందిన పలువురు క్రీడాకారులు పతకాలను వాపాసు చేస్తామని తెలిపారు.
ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన తొమ్మిదో రోజూ ఉద్ధృతంగా సాగింది. ఉద్యమానికి మద్దతుగా సరిహద్దులకు వివిధ ప్రాంతాల రైతులు భారీగా తరలివస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ సరిహద్దుల్లో ఆందోళన తీవ్రతరమవుతోంది. రైతులు 9వ నెంబర్ జాతీయరహదారిని దిగ్బంధించారు. కన్నాట్ ప్లేస్ నుంచి జంతర్ మంతర్ దిశగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సమాఖ్య, ఇతర ప్రజాసంఘాలు చేపట్టిన ప్రదర్శనను శుక్రవారం పోలీసులు అడ్డుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 05 Dec,2020 07:46AM