హైదరాబాద్ : పొరుగు దేశం పాకిస్థాన్ లో బాంబు పేలుడు ఘటన సంభవించింది. ఈ బాంబు దాడిలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన పాక్ లోని రావల్పిండి నగరంలో చోటుచేసుకుంది. రావల్పిండిలో మిలటరీ స్థావరం సమీపంలో బాంబు పేలుడు జరిగింది. టైమ్ డివైజ్ రావల్పిండి నగర బస్ టెర్మినల్ సమీపంలో పేలిందని రావల్పిండి నగర పోలీసు అధికార ప్రతినిధి సజ్జాద్ ఉల్ హసన్ చెప్పారు. ఈ బాంబు దాడికి కారణాలు ఎవరనేది ఎవరూ ప్రకటించలేదు. బాంబు దాడికి ఎవరు పాల్పడ్డారనే విషయంపై రావల్పిండి పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm