హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో దాదాపు రూ.50 లక్షల విలువైన 326 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. జగ్గారం క్రాస్రోడ్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా నుంచి జహీరాబాద్కు తరలిస్తున్నట్లు వెల్లడైంది. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm