అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 63,406 కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారిలో 599 మందికి కొవిడ్ నిర్ధారణ అవగా.. ఆరుగురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 8,70,675కి చేరింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మృతిచెందిన వారి సంఖ్య 7,020కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 913 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,422 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,02,93,151 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm