హైదరాబాద్: మహారాష్ట్రలోని పుణె పట్టణంలో పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా రాకెట్టు కేసులో దర్యాప్తునకు సంబంధించి పుణె పోలీసులు వరుస దాడులు నిర్వహించారు. అనంతరం హవాలా లావాదేవీలు నడుపుతున్నారనే ఆరోపణలతో తొమ్మిది మందిని పుణె పోలీసులు అరెస్టు చేశారు. వాని నుండి రూ. 3.47 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ బచ్చన్ సింగ్ తెలిపారు. ఈ డబ్బును హవాలా ద్వారా గుట్కా సరఫరాదారులకు బదిలీ చేస్తున్నట్లు ఒక అధికారి పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm