హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేపట్టిన ఆందోళన మరింత తీవ్రం కానుంది. ఈనెల 8వ తేదీన భారత్ బంద్ పాటించాలని రైతు నాయకుడు హర్వీదర్ సింగ్ లడ్క్‌వాల్ పిలుపునిచ్చారు. ‘‘కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరాము. ఐదో తేదీన దేశవ్యాప్తంగా ప్రధాని దిష్టిబొమ్మలను దహనం చేస్తాము. డిసెంబర్ 8వ తేదీన భారత్ బంద్ పాటించాలని పిలుపునిస్తున్నాము’’ అని భారతీయ కిసాన్ యూనియన్ లోఖోవాల్ జనరల్ సెక్రటరీ హర్వీదర్ సింగ్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm