హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు అందుతున్న ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ గతం కంటే చాలా సీట్లు తక్కువగా వస్తున్నాయి. ఇక రాష్ట్రంలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. టీఆర్ఎస్ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్లోనూ బీజేపీ విజయం సాధిస్తోంది. ఈ క్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. హబ్సిగూడ డివిజన్‌లో ఆయన భార్య స్వప్న ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి చేతన చేతిలో ఆమె పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో స్వప్న విజయం సాధించగా.. ఈసారి మాత్రం ఓడిపోయారు. హబ్సిగూడ డివిజన్ ఉప్పల్, ఎల్‌బీనగర్ నియోజక పరిధిలోకి వస్తుంది. డివిజన్‌ను మహిళలకు రిజర్వ్ చేశారు. ఈ డివిజన్‌లో 49,007 మంది ఓటర్లున్నారు. ఇందులో 25,401 పురుషులు, 23,605 పురుషులు, 50 మంది థర్డ్ జెండర్స్ ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm