హైదరాబాద్: నల్గొండ జిల్లా చండూరు మండలంలో ఈత కల్లు తాగి ఒకరు మరణించగా, మరో ముగ్గురు తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...తుమ్మలపల్లికి చెందిన గున్రెడ్డి మోహన్రెడ్డిల పొలం వద్ద ఉన్న ఈత చెట్లకు బంగారిగడ్డకు చెందిన గీత కార్మికుడు కల్లు గీస్తున్నాడు. కాగా, ఈత చెట్టును కొమ్ము పురుగు తొలుస్తుండడంతో గీత కార్మికుడు మోనోక్రోటోఫాస్ పురుగుల మందును పిచికారీ చేశాడు. మరుసటి రోజు గురువారం పారిన కల్లును గున్రెడ్డి రాఘవరెడ్డి, ఆయన కుమారుడు మల్లికార్జున్రెడ్డి (12)తోపాటు గడ్డివాము వేసేందుకు వచ్చిన కూలీలు సేవించారు. కొంత సమయం తరువాత వారికి వాంతులు కావడంతో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm