హైదరాబాద్: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. సిద్దిపేట జిల్లాలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదంలో ఐదుగరు మరణించారు. సహాయ చర్యల్లో పొల్గొన్న సిఐ, 12 మంది పోలీసులకు గాయాలయ్యాయి. సిద్దిపేట శివారులో శుక్రవారం సాయంత్రం కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని తీవ్రంగా గాయపడి ముగ్గురు దుర్మరణం చెందారు. ఘటనాస్థలంలో పోలీసులు సహాయ చర్యలు చేపడుతుండగా అక్కడివారిపైకి డీసీఎం వాయువేగంతో దూసుకువచ్చి ఢీకొట్టడంతో మరొకరు మృతి చెందారు. సీఐ, కానిస్టేబుల్‌తో సహా 12 మందికి గాయాలయ్యాయి. ప్రమాదంలో సిద్దిపేట టూటౌన్ సీఐ పరశురాంగౌడ్ గాయపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm