హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన కాల్పుల్లో మావోయిస్టు మిలీషీయా దళకమాండర్ మరణించాడు. బీజూపూర్ జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు మిలీషియా దళకమాండర్ మృతి చెందినట్లు జిల్లా ఎస్పీ కమలోచన్ కశ్యప్ తెలిపారు. సంఘటనా స్థలం నుంచి మావోయిస్టు మృతదేహంతో పాటు వారికి సంబంధించిన వస్తు సామగ్రిని స్వాధీనపరుచుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm