హైదరాబద్: బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 వివాదాలకు కేంద్రబిందువు అవుతోంది. అయితే ఈసారి బాగ్ బాస్ 4 తెలిసిన కంటెస్టెంట్స్ లో సింగర్ నోయల్ కూడా ఉన్నాడు. బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు ఈ షోపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ షోపై విమర్శలు చేసిన వారిలో సింగర్ నోయల్ చేరారు. ఆరు వారాల తర్వాత అనారోగ్యంతో ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఖచ్చితంగా చివరి వరకు ఉంటారు అనుకున్నా నోయల్ మధ్యలోనే అనారోగ్యంతో అలా వెళ్ళి పోవడం చాలా మందికి నచ్చలేదు. అనారోగ్య కారణాల వల్ల నోయల్ ఎలిమినేట్ కావడంతో నోయల్ మళ్లీ హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే కరోనా విజృంభణ నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్ల రీఎంట్రీపై ఆసక్తి చూపలేదు. దీంతో అదేవారం ఆయన ఇంటికి వెళ్లిపోతున్నట్లు కన్ఫర్మ్ చేశాడు. ఇదిలా ఉంటే తాజా ఇంటర్వ్యూలో బిగ్ బాస్ షో పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇంటర్వ్యూలో అసలు ఈ కార్యక్రమానికి ఎందుకు వెళ్లానో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చాడు నోయల్. దీనికి వెళ్లి వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు మనకు అవసరం లేదని అర్థమైంది అంటున్నాడు నోయల్. అందుకే తను బయటికి వచ్చిన తర్వాత షో కూడా చూడడం మానేసినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ బాగానే ఆడుతున్నారని ఉన్న పరిస్థితులు చూస్తుంటే అభిజిత్ విన్నర్ అయ్యేలా కనిపిస్తున్నాడు అని చెప్పాడు నోయల్. ఇదిలా ఉంటే బిగ్ బాస్ షో పై ఈయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆరు వారాలు ఆ ఇంట్లో ఉండి అప్పుడు బిగ్ బాస్ గురించి ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపించి ఇప్పుడు మాట మార్చినందుకు ఆయన్ను ట్రోలింగ్ చేస్తున్నారు. అంత నచ్చనప్పుడు ఎందుకు బిగ్ బాస్ కి వెళ్లావు.. అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm