హైదరాబాద్ : ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే కీలక సన్నివేశాలను తెరకెక్కించిన రాజమౌళి.. మరో షెడ్యూల్‌ని మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో ప్లాన్ చేశారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది. మూవింగ్ క్రేన్ షాట్లు, డ్రోన్ షాట్లు తీసినట్టు వీడియో చూస్తే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm