హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఉద్యమానికి అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం (ఏఐఐఈఏ) సంఘీభావం ప్రకటించింది. రైతులు తమ పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర పొందడాన్ని న్యాయపరమైన హక్కును చేయాలని డిమాండ్ చేసింది. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన రైతులు చేపట్టిన ఉద్యమాన్ని క్రూరంగా అణచివేయాలని చూస్తుండడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేసింది. రతిపక్షాలు పూర్తిగా రైతుల పక్షం వహించగా, అధికార పక్షంలోని కొన్ని పార్టీలు కూడా కర్షకులకు మద్దతుగా గళం విప్పుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm