హైదరాబాద్ : ఈ జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో పలువురు సినీ సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజశేఖర్ తన భార్య జీవితతో కలిసి వెళ్లి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజశేఖర్ ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. ఫిల్మ్‌నగర్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ నందు రాజశేఖర్ మరియు జీవిత ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే రాజశేఖర్ కరోనా బారీన పడి ఈ మద్యనే కోలుకున్నారు. అయితే మీడియాతో మాట్లాడిన రాజశేఖర్ సరిగ్గా మాట్లడలేకపోయారు. తాను రీకవరి అవ్వడానికి ఇంకా రెండు నెలలు పడుతుందని నా లంగ్స్ చాలా ఎఫెక్ట్ అయ్యాయి అని ఆయన చెప్పుకోచ్చారు. రాజాశేఖర్ కరోనా నుండి కోలుకుని బయటకు రావడం ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్న ఆయన సరిగ్గా మాట్లాడలేకపోవడం పట్ల నిరాశలో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm