నవతెలంగాణ - డిచ్ పల్లి: పోలీస్ స్టేషన్ పరిధిలోని డిచ్పల్లి రైల్వేస్టేషన్ వద్ద ఉన్న రెండు బంగారు దుకాణాల్లో అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు షట్టర్లను ధ్వంసం చేసి లోనికి చొరబడి ఉన్న నగదును ఎత్తుకెళ్లినట్లు ఎస్సై సురేష్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.రైల్వే స్టేషన్లో ఉన్న శ్రీ దుర్గా గోల్డ్ వర్క్ షాప్ లొఉంచినా ఇరవై వేల నగదు, శ్రీ శివసాయి గోల్డ్ షాప్ లో షో నెలకు రూ తొమ్మిది వేల నగదును గుర్తుతెలియని వ్యక్తులు షట్లర్లు పైకిలేపి లోపల ఉంచిన నగదును ఎత్తుకెళ్లినట్లు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు ఉదయం దుకాణాలకు వచ్చి చూడగా సెటైర్ లేపి ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందజేసినట్లు ఆయన తెలిపారు.పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలను సేకరించి యజమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.గత కొన్ని నెలల క్రితం రైల్వేస్టేషన్లోని ఒక బంగారం దుకాణం ఎదుట యజమాని ద్విచక్రవాహనంపై బంగారంతో కూడిన బ్యాగ్ను పెట్టగా ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై ఎత్తుకెళ్లారు ఆ సంఘటన మరువక ముందే మరోసారి బంగారం దుకాణాలపైనే దొంగతనాలు చేపట్టడంతో బంగారు దుకాణాల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm