· డెటాల్ పాఠశాల పారిశుభ్రత కార్యక్రమానికి గత మూడేళ్లలో రూ.15.9 కోట్ల ప్రారంభిక పెట్టుబడితో విలువైన ఫలితాలను అందించింది
· కొవిడ్-19 వ్యాప్తిని నియంత్రించేందుకు చేతుల పరిశుభ్రతకు చాలా ప్రాముఖ్యత ఉన్న సమయంలో, విద్యార్థులు పరిశుభ్రత అలవాట్లను అనుసరించడంలో 86% వృద్ధి కనిపించింది.
ఢిల్లీ: ఆర్‌బి, తన ప్రధాన ప్రచార జాగృతి డెటాల్ బనేగా స్వాస్థ్ ఇండియా టుడేలో భాగంగా, ISC-FICCIఇండియన్ శానిటేషన్ కాన్‌క్లేవ్ 2020లో విజయవంతమైన తన డెటాల్ స్కూల్ హైజీన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంకు మద్దతుగా రూపొందించిన సోషల్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ (SROI) మూల్యాంకన అధ్యయన నివేదికను విడుదల చేసింది. కొవిడ్- 19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని వర్చువల్ విధానంలో నిర్వహించిన కార్యక్రమంలో, పాఠశాలల్లో చేతుల పరిశుభ్రతకు అనుసరించవలసిన సమగ్ర విధానం, దాని ప్రాధాన్యతల గురించి చర్చించారు.
పరిశుభ్రత మరియు ప్రజారోగ్యం మధ్య సంబంధం గురించి ఇప్పుడు ప్రతి ఒక్కరికీ స్పష్టత వచ్చింది. అయినప్పటికీ, దేశంలోని చాలా ప్రాంతాల్లో సరైన విధానంలో చేతులు కడుక్కునే విషయంలో ఇప్పటికీ అస్పష్టత అలానే ఉంది. గ్రామీణ భారతదేశంలో భోజనానికి ముందుగా 69.9% మంది ఇప్పటికీ సబ్బు లేకుండానే చేతులు కడుక్కుంటారు. మరుగుదొడ్డి ఉపయోగించిన తరువాత 15%మంది మాత్రమే చేతులు కడుక్కుంటున్నారు. ప్రవర్తనకు సంబంధించిన మార్పులను ప్రోత్సహించడం ద్వారా పాఠశాలలు, నివాసాలు మరియు సమాజంలో పేలవంగా ఉన్న పారిశుద్ధ్య అలవాట్లను మెరుగుపరిచే దిశలో డెటాల్ పాఠశాల పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నారు.
రెకిట్ బెంకైజర్ హెల్త్ AMESAవిదేశాంగ వ్యవహారాల విభాగం మరియు భాగస్వామ్యాల డైరెక్టర్ రవి భట్నాగర్ మాట్లాడుతూ, “అందరికీ ఆరోగ్యం మరియు పరిశుభ్రత అనే ఆలోచన విధానాన్ని డెటాల్ బిఎస్‌ఐలో మేము విశ్వసిస్తున్నాము. మా అభివృద్ధి భాగస్వాములభాగస్వామ్యంతో డెటాల్ స్కూల్ హైజీన్ ఎడ్యుకేషన్ ద్వారా వయస్సు తగిన ప్రవర్తనా విధానాలకు అనుగుణంగా చిన్న పిల్లలలో ప్రవర్తన మార్పును తీసుకు వచ్చేందుకు దీన్ని అందుబాటులోకి తీసుకు వచ్చాము. పరిశుభ్రమైన వాతావరణాన్ని విస్తృతం చేయవలసిన అవసరం గురించి మరియు బాలల్లో ఇన్‌ఫెక్షన్ వ్యాప్తిని నివారించడంలో చేతులను శుభ్రపరచుకునే ప్రాముఖ్యతను తెలియజేసే లక్ష్యాన్ని కలిగి ఉన్నామని’’ వివరించారు.
దీని గురించి ఆయన మరింత వివరిస్తూ, “కార్పొరేట్‌లు, స్వచ్ఛంద సంస్థలు మరియు పౌరులు అందరూ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితిని పరిష్కరించేందుకు, ఈ మహమ్మారిపై పోరాడేందుకు మనమందరం కలిసి రావాలి. ఒంటరి ప్రయత్నంతో చేసిన పెట్టుబడిపై తక్కువ సామాజిక లబ్ది చేకూరుతుంది, అయితే ఎక్కువ మంది కలిసి కట్టుగా ముందుకు వస్తే నీరు, పౌష్ఠికాహార హక్కు మరియు విరేచనాల నిర్వహణకు సంబంధించిన అంశాల్లో సామాజికంగా 1:47 నిష్పత్తిలో జాగృతి కల్పించవచ్చు. ఇది సమాజంపై పెను ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ మహమ్మారి సమస్యను పరిష్కరించేందుకు మేము పరిశుభ్రత, పారిశుధ్యం మరియు ఆరోగ్యాన్ని వేర్వేరుగా కాకుండా కలిసి చూసే సమయంగా భావిస్తున్నామని’’ తెలిపారు.
ఇండియా శానిటేషన్ కూటమి అధ్యక్షురాలు నైనా లాల్ కిద్వాయిమాట్లాడుతూ “నగదు పెట్టుబడితో పాటు, ఆర్‌బి వంటి కార్పొరేట్లు కూడా విజయవంతంగా అమలు చేయగల సామర్థ్యాన్ని మరియు ఫలితాలను లెక్కించవలసిన అవసరాన్ని డెటాల్ స్కూల్ హైజీన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం తన SROIనివేదికలో పేర్కొంది. పెట్టుబడి పెట్టిన ప్రతి రూ.1కి మనం కొలవగలిగే రూ.33 సామాజిక విలువను పంపిణీ చేసి, ఇప్పటి పరిస్థితులకు చక్కని ప్రభావాన్ని చూపించించదని’’ వివరించారు.
‘‘పాఠశాలలో పరిశుభ్రత కార్యక్రమాల ద్వారా, పిల్లలు మరియు తల్లిదండ్రుల పాత్రలు రివర్సు కావడం మేము చూశాము. బాలలు తమ చేతులను కడుక్కునేందుకు సరైన మార్గాన్ని బోధించే పాత్రకు మారిపోయారు. ఆరోగ్యం &పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడంలో వారు సమాజంలో మార్పుకు ప్రతినిధిగా మారారు.పరిశుభ్రతకు సంబంధించిన పాఠ్యాంశాలు రోజువారీగా పాఠశాలలో బోధించవలసిన అవసరం ఉందని మేము విశ్వసిస్తున్నాము. మహమ్మారి సమయంలో మనం చూసినట్లుగా, వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకునే ఏకైక మార్గం చేతులు కడుక్కోవడమేనని’’ అగా ఖాన్ ఫౌండేషన్ సిఇఒ శ్రీమతి టిన్ని స్వాహ్నీపేర్కొన్నారు.
నివేదిక నుంచి కీలక అంశాలు:
పెట్టుబడి పెట్టిన ప్రతి రూ.1కి,డెటాల్ స్కూల్ పరిశుభ్రత విద్యా కార్యక్రమం రూ.33.05 సామాజిక విలువను అందించింది.
· రూ.15.9 కోట్ల ప్రారంభిక పెట్టుబడితో కీలకమైన పరిశుభ్రత చర్యలను బలోపేతం చేసేందుకు సృజనాత్మక ప్లాట్‌ఫారాలను ఉపయోగించడం, పాఠశాలల్లో నిర్మాణాత్మకంగా పరిశుభ్రతకు సంబంధించిన కార్యక్రమాలు, పలు స్థాయిల్లో శిక్షణకు మద్దతు ఇవ్వడం తదితర ఆవిష్కరణల ద్వారా విలువైన ఫలితాలను ఇవ్వగా, దీని ద్వారా మేము రూ.526 కోట్ల సామాజిక విలువను తీసుకువచ్చాము.
· కొవిడ్-19 వ్యాప్తిని నియంత్రించేందుకు చేతి పరిశుభ్రతకు చాలా ప్రాముఖ్యత ఉన్న సమయంలో, విద్యార్థులు పరిశుభ్రత పద్ధతులను అవలంబించడంలో 86%వృద్ధి కనిపించింది.
· ఈ కార్యక్రమం ఇప్పటివరకు 13 మిలియన్ల బాలల్ని మరియు భారతదేశ వ్యాప్తంగా 8 రాష్ట్రాలు, 40 జిల్లాలు మరియు 650,000 పాఠశాలలకు చేరుకుంది.
· స్వచ్ విద్యాలయ (క్లీన్ స్కూల్) పథకంలో భాగంగా ప్రధాని నుంచి 250+ పాఠశాలలు పురస్కారాలు అందుకున్నాయి.
· బాలలపై ప్రత్యక్ష ప్రభావం:
o బాలల్లో డయేరియా 14.2% తగ్గింది
o పాఠశాలకు హాజరు 17%వృద్ధి చెందింది
o 89% విద్యార్థులు పాఠశాలలో బోధనకు అనుగుణంగా అవసరమైన అన్ని పరిశుభ్రత పద్ధతులను అనుసరించారు.
o 92% విద్యార్థులు తమ తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులతో పరిశుభ్రతకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నారు.
పాఠశాలలను మరియు సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని అందుబాటులోకి తీసుకు వచ్చిన డెటాల్ స్కూల్ హైజీన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ప్రవర్తన మార్పును పలురకాలుగా ముందుకు నడిపించేందుకు ప్రయత్నిస్తోంది. పాఠశాలలో విద్యార్థుల మనస్తత్వం మరియు ప్రవర్తనను మార్చడం ద్వారా, వారు బడి, ఇల్లు మరియు పరిసరాల్లో మార్పుకు ఉత్ప్రేరకంగా మారతారనే వాస్తవాన్ని గుర్తించి దీన్ని పాఠశాల కార్యక్రమంగా రూపొందించారు. ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులతో కలిసి పనిచేయడం ద్వారా, బాలల్లో మరియు భవిష్యత్తు తరాలకు చెందిన విద్యార్థుల్లో మంచి అలవాట్లను పెంపొందించడానికి అవకాశం ఉంటుంది.
ప్రవర్తనా మార్పు కమ్యూనికేషన్/ కారకాన్ని తీసుకు వచ్చేందుకు సహాయపడిన ప్రధాన పాఠశాల పరిశుభ్రత విద్యా కార్యక్రమంలో:
1. పరిశుభ్రత కార్నర్: పోస్టర్లు, పెయింటింగ్‌లు తదితరాలను ఉపయోగించి చేతులను శుభ్రపరచుకునే పద్ధతులను నేర్పించేందుకు అంకితమైన విభాగం
2. ఆటల స్వీకరణ మరియు అనుభవపూర్వక అభ్యాస పద్ధతులు: నేర్చుకోవడం సరదాగా ఉండటానికి గేమిఫికేషన్ సహాయపడింది మరియు రోజువారీ అప్లికేషన్ ఇల్లు మరియు పాఠశాలలో నేర్చుకున్న పాఠాలను ప్రయోగాత్మకంగా తెలుసుకునేందుకు సహకరించింది.
3. పరిశుభ్రత వస్తు సామగ్రి పంపిణీ: సబ్బులు, చేతులు కడుక్కోవడం మరియు శానిటరీ ప్యాడ్‌లను అందుబాటులో ఉంచడం.
4. సోప్ బ్యాంకులు: భోజనానికి ముందు మరియు తరువాత లేదా మరుగుదొడ్డిని ఉపయోగించిన తరువాత శుభ్రం చేసుకునేందుకు వాష్ బేసిన్ల వద్ద సబ్బును అందుబాటులో ఉంచాలి.