హైదరాబాద్ : సిపిఐ(ఎం) వనపర్తి జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్ గారి సమక్షంలో ఆత్మకూరులోని గెస్ట్ హౌజ్ లో నిర్వహించిన సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు చెందిన పలువురు యువకులు సీపీఐ(ఎం) పార్టీ అనుబంధ సంస్థ డివైఎఫ్ఐకి ఆకర్షితులై యువకులు డివైఎప్ఐ లో చేరడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రధాని మోడీ దేశంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రెండు లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయకపోవడం ఏమిటని విమర్శించారు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు కేంద్రం ఇటీవల తెచ్చిన మూడు వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పెద్దయెత్తున ఆందోళన నిర్వహిస్తున్న రైతులకు సంఘీభావంగా ఈ నెల రెండు.మూడు తేదీల్లో తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా రాస్తారోకోలు ప్రదర్శనలకు పిలుపునిచ్చినట్లు ఆయన విజ్ఞప్తి చేశారుచలిని సైతం లెక్కచేయకుండా దక్షిణాది రాష్ర్టాల నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీకి చేరుకొని ఆందోళన నిర్వహిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో చలనం లేకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన వాపోయారు ఈ రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్దయెత్తున యువత పార్టీ శ్రేణులు పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అమరచింత మున్సిపల్ చైర్మన్ జీఎస్.గొపి సిపిఎం సీనియర్ నాయకులు మహమూద్ సీపీఐ(ఎం) జిల్లా నాయకులు పి శ్రీహరి ..అజయ్ వెంకటేశ్ రమేష్. ఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు .ఆత్మకూరు చెందిన యువకులు నవీన్ .పవన్ చిట్టిబాబు. శివ . స్వరాజ్ శరత్ .ఉదయ్ తదితరులు చేరారు.
Mon Jan 19, 2015 06:51 pm