హైదరాబాద్: భారతదేశం మొత్తం మీద ఫ్లెక్స్ స్పేస్ స్టాక్‌లో 4.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం హైదరాబాద్ ఉండగా, దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఇది ఒకటి అని జెఎల్‌ఎల్ ఇటీవల విడుదల చేసిన తన అధ్యయన నివేదిక Reimagine Flexspaces A 360⁰ view లో పేర్కొంది. హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో సౌకర్యవంతమైన స్థలాలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉండగా, ఈ క్లిష్ట సమయాల్లో ఆయా బిజినెస్‌లు తమ పోర్ట్‌ఫోలియో విస్తరణ మరియు పరిమితం చేసుకునేందుకు ఎక్కువ మద్దతు అవసరం ఉంది. ఇది భారతదేశంలో ఫ్లెక్స్ ఆఫీస్ మార్కెట్‌కు సంబంధించిన స్వాభావిక వృద్ధి సామర్థ్యాన్ని సూచిస్తుంది.
“ఫ్లెక్స్ స్పేస్ ఆపరేటర్లు 1-2 ఏళ్ల లాక్-ఇన్-పీరియడ్‌తో వ్యవస్థీకృత వర్క్‌స్పేస్‌లను అందించారు. వచ్చే 1-2 ఏళ్లలో షెడ్యూల్ డెలివరీతో ముందే లీజుకు తీసుకున్న కంపెనీలు తమ తాత్కాలిక కార్యాలయాలను కలిగి ఉండేందుకు అటువంటి ఫ్లెక్స్ ప్రదేశాలపై ఆసక్తి కనబరిచాయి. పెద్ద బహుళ జాతీయ కంపెనీలతో పాటు, కన్సల్టింగ్, ఐటి, లాజిస్టిక్స్ రంగాల్లో హైదరాబాద్‌లో అనేక అంకుర పరిశ్రమలు మరియు చిన్న కంపెనీలు ఉన్నాయి. తక్కువ మూలధన పెట్టుబడితో పాటు చిరు స్థాయి పారిశ్రామికవేత్తలకు ఫ్లెక్స్ స్థలాలు ఆర్థిక వెసులుబాటును కల్పించాయని” జెఎల్‌ఎల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు హెడ్ (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్) సందీప్ పట్నాయక్ వివరించారు.
హైదరాబాద్‌లోని ఫ్లెక్స్ స్పేస్ మార్కెట్ 2018 మధ్యకాలం నుంచి భారీ స్థాయిలో మార్పులు చేసుకుంటూ 2019 నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంది. 2019లో నగరంలో మొత్తం ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో 28% ఫ్లెక్స్ ఖాళీలు ఉన్నాయి. స్టార్టప్‌లు మరియు తక్కువ పరిమాణం ఉన్న కంపెనీలకు ఫ్లెక్స్ ఖాళీ స్థలాలు ఇప్పటికే ప్రజాదరణ దక్కించుకోగా, పెద్ద BFSI మరియు IT-ITeS తాము ప్రధానంగా నిర్వహించే కార్యాలయ స్థలాలు మరియు ఇంక్యుబేషన్ విభాగాన్ని ఎక్కువ చేసుకుంటున్నాయి. గత 2-3 ఏళ్లలో నగరంలో ఫ్లెక్స్ స్పేస్ ఆపరేటర్ల గణనీయమైన విస్తరణకు ఇది మద్దతు ఇస్తోంది.
జెఎల్ఎల్ తన తాజా నివేదిక ప్రకారం, 2020లో 3వ త్రైమాసికంలో హైదరాబాద్ కార్యాలయ మార్కెట్‌లో 1.9 మిలియన్ చ.అడుగుల విస్తీర్ణం, ఆరోగ్యకరమైన స్థూల లీజింగ్‌తో రికవరీకి అనుగుణమైన బలమైన సంకేతాలు కనిపించాయి. అదే సమయంలో, గత త్రైమాసికంతో పోల్చితే నికర శోషణ (net absorption) 31% వృద్ధితో చెంది 2020లోని 3వ త్రైమాసికంలో 1.5 మిలియన్ చ.అడుగులకు చేరుకుంది.
దేశం రానున్న 2021లో ఆ తరువాత ఏళ్లలో మరింత అభివృద్ధి చెందే అవకాశాలకు అనుగుణంగా, ఫ్లెక్స్ స్పేస్ మార్కెట్ నెమ్మదిగా మరియు మరింత లోతుగా వృద్ధి చెందుతుందని అంచనా. ఈ క్రమంలో అనేక స్వల్పకాలిక అంతరాయాలు మరియు సవాళ్లతో సంబంధం లేకుండా, పెద్ద సంస్థల నుంచి పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా, 2023 నాటికి ఫ్లెక్స్ స్పేస్ మార్కెట్ 50 మిలియన్ చదరపు అడుగులకు పైగా చేరుకునేందుకు మద్దతు ఇవ్వనుంది. సౌకర్యవంతమైన స్థలానికి డిమాండ్ సగటున సుమారుగా పెరుగుతుందని ఊహించబడగా, పరిస్థితులు కొంత కఠినంగా ఉన్నప్పటికీ రానున్న మూడు నుంచి నాలుగు ఏళ్లలో ఏడాదికి 15-20% వృద్ధి చెందుతుందని అంచనాలు ఉన్నాయి. ఆపరేటర్లు తమ ప్రస్తుత కార్యకలాపాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, కొత్తగా వచ్చే పెట్టుబడి స్థాయి గతంలో కన్నా ఎక్కువగా ఉండే అవకాశాలు లేవు మరియు కొందరు ఆపరేటర్లు గడ్డు పరిస్థితులకు అనుగుణంగా తమ పనితీరును చూపించడం లేదు.
కార్పొరేట్‌లు తమ కార్యాలయాల నిర్వహణ అంశంలో, తమ మూలధన వ్యయాన్ని తగ్గించుకుంటూ, పొదుపు సూత్రాన్ని అనుసరించేందుకు ప్రాధాన్యత ఇస్తూ, సిబ్బందిని బృందాలుగా విడదీయడం, ఎక్కువ సాంద్రత లేకుండా చూసుకుంటున్న నేపథ్యంలో వారి అవసరాలను ఫ్లెక్స్ మార్కెట్లు పరిష్కరిస్తున్నాయి. ప్రారంభంలో ఫ్లెక్స్ మార్కెట్ల వృద్ధికి దారితీసిన పరిణామాలు, ఉత్పాదకతను పెంచుకునేందుకు మరియు డైనమిక్ వర్క్ కల్చర్‌ను తీసుకు వచ్చేందుకు, ఉద్యోగుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చేందుకు కార్యాలయాలను ఉపయోగించడంపై దృష్టి పెట్టడం వంటివి భారతదేశంలో తదుపరి దశను ప్రభావితం చేయనున్నాయి.
‘‘గత 3 ఏళ్లలో ఫ్లెక్స్-స్పేస్ మార్కెట్ మూడు రెట్లు వృద్ధి చెందగా, రానున్న రోజుల్లో ఈ వేగం కొంత మందగించే అవకాశం ఉంది. పారిశ్రామికవేత్తలు కొంత ఆచితూచి వ్యవహరించినప్పటికీ, మొత్తం మార్కెట్ ప్రస్తుత పరిమాణం నుంచి 1.5 రెట్లు విస్తరించే అవకాశం ఉంది. అదే సమయంలో, సౌకర్యవంతమైన స్థలానికి డిమాండ్ స్థిరంగా కొనసాగే అవకాశం ఉంది మరియు పెద్ద సంస్థల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా 2023 నాటికి ఫ్లెక్స్ స్పేస్ మార్కెట్ పరిమాణం 50 మిలియన్ చ.అడుగులు అధిగమిస్తుందని మేము అంచనా వేస్తున్నామని’’ జెఎల్‌ఎల్ ఇండియాలో చీఫ్ ఎకనామిస్ట్ మరియు రీసెర్చ్ & REIS విభాగాధిపతి డా.సమంతక్ దాస్ తెలిపారు.
వాణిజ్య రియల్ ఎస్టేట్ విభాగంలో ఫ్లెక్స్ స్థలాలు అనేవి అనుకూలతకు ప్రత్యామ్నాయ పదంగా మారాయి. ప్రాధాన్యతలు వృద్ధి చెందుతున్నప్పుడు, కార్యాలయానికి దూరంగా ఉంటూ చేసే పనితో సహా మార్పు సంతరించుకుంటున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా సౌకర్యవంతమైన స్థలం ఎంపికల శ్రేణి రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుతం ఎదురైన అంతరాయానికి ప్రతిస్పందించేందుకు మరియు పరిశ్రమకు శాశ్వత మార్పులు ఏమిటనే అంశంపై వ్యవహరించి, పునాదులు వేసేందుకు, ఫ్లెక్స్ స్పేస్ ఆపరేటర్లు చురుకుగా ఉంటూ, తమ వ్యాపార వ్యూహాలను మరింత పదును పెడుతున్నారు. వారు ఇప్పుడు తమ ఫ్లెక్స్ స్పేస్ సెంటర్లలో స్థిరమైన ఆక్యుపెన్సీ స్థాయిలను నిర్ధారించుకునేందుకు, లాభదాయకత మరియు అభివృద్ధి చెందుతున్న వ్యూహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
డిమాండ్ పెంచనున్న పెద్ద సంస్థలు
గత దశాబ్దంలో మొదలైన సాంద్రత ధోరణి అంశం స్థల సాంద్రతను సడలించేందుకు, అనువైన కార్యాలయ స్థలంపై మొగ్గు చూపే సంస్థలతో రివర్స్ అవుతుంది. ప్రయాణ సంస్థలు మరియు ప్రజా రవాణాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, పెద్ద సంస్థలు తమ కార్యాలయాలను విభజించడం కూడా ఇందులో చూడవచ్చు. ఏదేమైనా, ఊహించిన ఆర్థిక అనిశ్చితితో, కంపెనీలు రియల్ ఎస్టేట్‌కు భారీ స్థాయిలో మూల ధనాన్ని ఇచ్చేందుకు వెనుకాడుతున్నాయి. వ్యూహపరంగా, థర్డ్ పార్టీ సౌకర్యవంతమైన స్పేస్ ఆపరేటర్‌కు నేరుగా లీజుకు ఇవ్వడం అనేది విస్తృతంగా స్వీకరించబడిన మోడల్‌గా ఉంది. భాగస్వామ్య నమూనా భూస్వాములు మరియు ఆపరేటర్లు ఇద్దరి బలాన్ని పరస్పరం ప్రభావితం చేసుకునేందుకు అనుమతిస్తోంది. భాగస్వామ్యాన్ని అమలు చేసుకునేందుకు పలు మార్గాలు ఉండగా, రెవెన్యూ వాటాలు మరియు నిర్వహణ ఒప్పందాలు సర్వసాధారణంగా కనిసిస్తాయి. రెవెన్యూ వాటా ఎంపిక కింద, రెండు పార్టీలు అప్‌సైడ్ డౌన్‌గా విభజించుకున్నాయి. నిర్వహణ ఒప్పందం విషయంలో, ఆపరేటర్‌కు స్థిరమైన చెల్లింపు లభిస్తుండగా, భూస్వామి అన్ని లీజింగ్ రిస్క్‌లను భరిస్తాడు మరియు లాభాల ప్రయోజనాన్ని ఆస్వాదిస్తాడు. ఈ విధానంతో ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం భారతదేశంలో ఇటువంటి భాగస్వామ్యాలు చాలా తక్కువగా ఉన్నాయి.
భవిష్యత్తు ఎలా ఉండనుందో
దేశంలో 300కి పైచిలుకు ఫ్లెక్స్ స్పేస్ ఆపరేటర్ల ప్రవేశంతో మార్కెట్‌ను ఒక సరుకుగా మార్చేందుకు సహాయపడింది. మహమ్మారికి ముందు, ఈ ఆపరేటర్లలో ఎక్కువ మంది తమ పరిధిని పెంచుకునేందుకు మరియు మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకోవడంపై దృష్టి పెట్టారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో మూలధనం అందుబాటు సవాలుగా మారుతోంది. ఇప్పటివరకు దూకుడుగా వృద్ధిని సాధించిన పారిశ్రామికవేత్తలు, కంపెనీల యజమానులు మూల ధనం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పెద్ద ఆపరేటర్లచే నడిచే ఏకీకృత కార్యకలాపాలను మార్కెట్ వీక్షించే అవకాశం ఉంది. సౌకర్యవంతమైన కార్యాలయాలు భారత కార్యాలయ మార్కెట్ల భవిష్యత్తుకు అనుగుణంగా ప్రధాన ప్రభావంగా కొనసాగనున్నాయి. అనుకూలీకరించిన ఆఫీస్ స్పేస్ పరిష్కరణలు అందించడంలో మరింత ఎక్కువ దృష్టి సారిస్తూ, సౌకర్యవంతమైన స్థలం కోసం డిమాండ్ తిరిగి తీసుకు రావడంతో పాటు, ఈ స్థలాలను వినియోగించుకునేందుకు కోర్ ప్లస్ ఫ్లెక్స్ మోడల్‌ను మరింత విస్తృతంగా స్వీకరించనున్నారు. కొవిడ్-19 ప్రభావంతొ ఈ దిశలో భారీ అంతరాయం వచ్చినప్పటికీ, సౌకర్యవంతమైన పని స్థలాల భవిష్యత్తు ఆశాజనకంగా ఉండనుంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 01 Dec,2020 06:48PM