హైదరాబాద్ : సూర్యాపేట జిల్లాలో కోతులు దాడి చేయడంతో ఓ మహిళ మృతి చెందింది. దోమల శ్రీలత అనే మహిళ ఇంట్లోకి మంగళవారం ఉదయం కోతులు ప్రవేశించాయి. దీంతో ఆ మహిళ తన ఇంట్లోకి వచ్చిన కోతులను తరిమికొట్టే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కొన్ని కోతులు ఆమెపై దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో ఆమె కిందపడిపోయింది. ఆమె తలకు తీవ్రమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. సూర్యాపేట జిల్లా ఎమదిరాల మండలం కుక్కడం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళ మృతితో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఆ మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm