Delhi: Government is giving a detailed presentation to the farmers' leaders on Minimum Support Price (MSP) and Agricultural Produce Market Committee (APMC) Act.
— ANI (@ANI) December 1, 2020
Meeting underway at Vigyan Bhawan. https://t.co/mMd5On5RSH
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత ఆరు రోజులుగా దేశరాజధానిలో ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు చర్చలు ప్రారంభించింది. విజ్ఞాన్ భవన్‌లో 35 రైతు సంఘాల నాయకులతో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తో కలిసి భేటీ అయ్యారు. ప్రస్తుతం పంజాబ్‌కు చెందిన రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరుపుతోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా, ఢిల్లీ రాష్ట్రాల రైతులతో సాయంత్రం 7గంటలకు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు వ్యవసాయ మంత్రి తోమర్ మాట్లాడుతూ.. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
రైతుల నిరసన రోజురోజుకీ తీవ్రమవుతుండటంతో కేంద్రం దిగొచ్చింది. మంగళవారం చర్చలకు రావాలని ఆహ్వానించింది. నిజానికి ఈ చర్చలు గురువారం జరగాల్సి ఉంది. అయితే కరోనాతో పాటు చలితీవ్రతను అధికంగా ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని రెండు రోజులు ముందుగానే వీటిని నిర్వహించేందుకు కేంద్రం దిగొచ్చింది.