హైదరాబాద్ : నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) మహిళా నాయకురాలు రేఖా బావుసాహెబ్ జారే దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన మహారాష్ర్ట అహ్మద్‌నగర్ జిల్లాలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. రేఖా తన కారులో తల్లి, కుమారుడితో కలిసి పుణె నుంచి అహ్మద్‌నగర్ వెళ్తుండగా గుర్తు తెలియని ఇద్దరు దుండగులు కలిసి హత్య చేశారు. హత్యకు ముందు రేఖాతో వారిద్దరూ వాగ్వాదానికి దిగారు. రేఖా తల్లి గొడవను ఆపేందుకు యత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తీవ్ర ఆగ్రహాంతో ఊగిపోయిన ఓ దుండగుడు కత్తితో రేఖా గొంతును కోసి పారిపోయాడు. ఈ ఘటనపై అహ్మద్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రేఖా హత్య వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm