హైదరాబాద్ : యాపిల్ సంస్థకు యాంటీ ట్రస్ట్ అథారిటీ షాక్ ఇచ్చింది. యాపిల్ తప్పుదోవ పట్టించే వ్యాపార విధానాలు అనుసరించినందుకు ఇటలీలోని యాంటీ ట్రస్ట్ అథారిటీ 1.20 కోట్ల డాలర్ల జరిమానా విధించింది. ఐఫోన్‌లకు సంబంధించి ఈ విధానాలు అనుసరించినట్టు పేర్కొంది. యాపిల్ సంస్థ వివిధ రకాల ఐఫోన్ మోడళ్లపై ఎటువంటి వివరణలు లేకుండా వాటర్ రెసిస్టెంట్లుగా ప్రచారం చేసిందని నియంత్రణ సంస్థలు పేర్కొన్నాయి. కంపెనీ డిస్ క్లైమర్‌లో మాత్రం ద్రవ పదార్థాల నుంచి ఫోన్ దెబ్బ తింటే వారందరికీ వారంటీ వర్తించదని పేర్కొంది. దీంతో పాటు నీటిలో పడి ఫోన్లు దెబ్బతిన్న వారికి సంస్థ ఎటువంటి సహకారం అందించలేదు.
Mon Jan 19, 2015 06:51 pm