హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. కొండాపూర్ డివిజన్‌లో హఫీజ్‌పేట ప్రేమ్‌నగర్, కూకట్‌పల్లి, జగద్గిరిగుట్టతోపాటు పలు డివిజన్లలోని పోలింగ్ కేంద్రాల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెదురుమదురు ఘటనలు మినహా అన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతుందని తెలిపారు. ఎవరైనా గొడవలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలందరూ స్వేచ్ఛగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీపీ సజ్జనార్ కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm