Supreme Court refuses to interfere with Bombay HC order which dismissed the petition filed by former ICICI Bank Chief Executive Officer and Managing Director, Chanda Kochhar challenging her termination last year, in connection with ICICI-Videocon case pic.twitter.com/DIPVeJRw28
— ANI (@ANI) December 1, 2020
ఢిల్లీ: మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందాకొచ్చర్‌కు సుప్రీంకోర్టులో ఎదరుదెబ్బ తగిలింది. తనను ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో, ఎండీ బాధ్యతల నుంచి తప్పించడాన్ని సవాల్ చేస్తూ చందాకొచ్చర్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ''బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పులో మేం జోక్యం చేసుకోలేం. ఇది ప్రయివేటు బ్యాంకుకు.. ఉద్యోగిగి మధ్య జరిగిన ఒప్పందం పరిధిలోకి వస్తుంది'' అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఏడాది మార్చి 5న చందాకొచ్చర్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కొచ్చర్ సుప్రీంకోర్టుకు వెళ్లగా.. అక్కడ కూడా ఆమెకు ఎదురు దెబ్బె తగిలింది.