मैं इसके योग्य नहीं 🙏 https://t.co/MywMiANRV2
— sonu sood (@SonuSood) November 30, 2020
హైదరాబాద్: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల దేశంలోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయి ఎన్నో ఇబ్బందులు పడ్డ వలస కూలీలకు సినీనటుడు సోనూసూద్ సాయం చేసిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ తర్వాత కూడా పలువురికి సాయపడి ఆయన అందరితోనూ శభాష్ అనిపించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కొందరు గుళ్లు కట్టి దేవుడిగా పూజిస్తూ హారతులు ఇస్తున్నారు. దీనిపై విష్ణు కుమార్ గుప్తా అనే నెటిజన్ ట్వీట్ చేస్తూ పలు ఫొటోలు పోస్ట్ చేశాడు. ఆయన చేసిన ట్వీట్ కు సోనూసూద్ స్పందించారు. గుళ్లు కట్టి పూజలు చేయడానికి తాను అర్హుడిని కాదంటూ ట్వీట్ చేశారు.