హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ రెండో రోజూ వాడీ-వేడిగా జరుగుతోంది. హౌసింగ్‌పై చర్చకు టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వమే అజెండాలో పెట్టినందున వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అయినా టీడీపీ సభ్యులు పట్టువీడకుండా సభా కార్యకలాపాలను పదే పదే అడ్డుకోవడంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. పలువురు ఎమ్మెల్యేలు స్పీకర్ స్థానంవైపు దూసుకెళ్లే ప్రయత్నించారు.. దీంతో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై స్పీకర్ తమ్మినేని మండిపడ్డారు. ఆ వెంటనే సభా కార్యక్రమాలకు అడ్డు తగిలినందుకు ఆయన్ను సభ నుంచి సస్పెండ్ చేసేందుకు తీర్మానం ప్రవేశపెట్టి.. ఆయన్ను మంగళవారం ఒక్క రోజు సభ నుంచి సస్పెండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 01 Dec,2020 11:13AM