హైదరాబాద్ : నివర్ తుపాను ఏపీ రైతులను దారుణంగా దెబ్బతీసింది. ఉత్తరాంధ్ర జిల్లాలు మినహా అన్ని జిల్లాలపైనా నివర్ పంజా విసిరింది. ఈ నేపథ్యంలో, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. పవన్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను జనసేన పార్టీ సోషల్ మీడియాలో విడుదల చేసింది. డిసెంబరు 2న పవన్ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తారు. అనంతరం 3, 4, 5 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలిస్తారు.
Mon Jan 19, 2015 06:51 pm