హైదరాబాద్ : ఓ సూపర్ పోలీస్‌కు సంబంధించిన వీడియోను గ్రేటర్ చెన్నై అడిషనల్ పోలీస్ కమిషనర్ మహేష్ అగర్వాల్ ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సినిమాలోని సన్నివేశం కాదని, రియల్ లైఫ్ హీరో అంట్లిన్ రమేష్ ఒంటి చేత్తో మొబైల్ స్నాచర్స్‌ను వెంటాడి పట్టుకున్న ఘటనకు సంబంధించినదని మహేష్ అగర్వాల్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆ మొబైల్ స్నాచర్‌ను పట్టుకోవడంతో మరో ముగ్గురిని అరెస్ట్ చేసి.. దొంగిలించిన 11 మొబైల్స్‌ను రికవరీ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఎస్‌ఐ రమేష్‌ను మహేష్ అగర్వాల్ పిలిచి మరీ అభినందించారు.
Mon Jan 19, 2015 06:51 pm