హైదరాబాద్ : లింగమార్పిడి చేయించుకుని ట్రాన్స్ ఉమన్ గా మారిన త్రినేత్ర ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయింది. కర్ణాటకకు చెందిన త్రినేత్ర అసలు పేరు అంగద్ గుమ్మరాజు. స్వస్థలం బెంగళూరు. అయితే తనలో స్త్రీ లక్షణాలు అధికంగా ఉన్నాయని భావించి లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంది. బెంగళూరులో ఎంబీబీఎస్ పూర్తిచేసిన త్రినేత్ర మణిపాల్ కస్తూర్బా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఇంటర్న్ షిప్ చేస్తోంది. ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీలో మొట్టమొదటి డాక్టర్ గా ఖ్యాతి పొందింది. త్రినేత్ర సోషల్ మీడియాలోనూ ఎంతో చురుగ్గా ఉంటుంది. తన జీవన ప్రస్థానం ఆధారంగా ఓ డాక్యుమెంటరీ కూడా రూపొందించింది.
తనను ఎంతో అసభ్యకర రీతిలో వేధించేవారని, అవమానకరంగా పిలిచేవారని, అయితే వాటన్నింటినీ అధిగమించి చదువుపై దృష్టి నిలిపి అనుకున్నది సాధించానని త్రినేత్ర మీడియాకు తెలిపింది. ఇటీవల తాను ఇంటర్న్ షిప్ చేస్తున్న ఆసుపత్రిలో ఓ ప్రసవం చేసి శిశువును చేతుల్లోకి తీసుకున్న క్షణాలు మరపురానివని పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 30 Nov,2020 07:06PM