హైదరాబాద్ : శ్రీలంక దక్షిణ ప్రావిన్స్‌లోని మహారా కారాగారంలో ఖైదీల మద్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో 8 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది ఖైదీలకు గాయాలయ్యాయి. ఓ వర్గానికి చెందిన ఖైదీలకు కరోనా సోకడంతో మరో వర్గానికి చెందిన ఖైదీలు ఆదివారం మధ్యాహ్నం జైలు నుంచి పరారయ్యేందుకు యత్నించగా ఘర్షణలు చోటు చేసుకున్నట్లు సమాచారం. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు జైలులో సిబ్బందికి సాయంగా కిలానియా ఎస్‌ఎస్‌పీ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనపై ఆ రాష్ట్ర జైళ్లశాఖ మంత్రి డాక్టర్ సుదర్శినీ ఫెర్నాడోపుల్లే పార్లమెంట్‌లో స్పందిస్తూ జైళ్ల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షతన స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపిస్తామని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm