ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతుల ఆందోళన తీవ్రమవుతున్న తరుణంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ ఉదయం షా నివాసానికి చేరుకున్న తోమర్ రైతుల నిరసనపై హోంమంత్రితో చర్చించారు. 12 గంటల్లో కేంద్రమంత్రులు భేటీ కావడం ఇది రెండోసారి. ఆదివారం రాత్రి బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, తోమర్ సమావేశమైన విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm