తిరుపతి: నగరంలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురుని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న తిరుగుతున్న ముగ్గురు ఎట్టకేలకు నగర పోలీసులకు చిక్కారు. ఈ ముఠా నుంచి సుమారుగా రూ. 20 లక్షల విలువైన బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరు ముగ్గురు బైక్ దొంగతనాలకు పాల్పడి, వాటిని తక్కువ ధరకు అమ్ముకుని జల్సాలకు అలవాటుపడినట్లు పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm