హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు,ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్‌ట్స(బాఫ్టా) సంస్థ ఇండియన్ బ్రేక్ త్రూ ఇనిషియేటివ్ అంబాసిడర్‌గా నియమించినట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. తన ఎంపికపై ఏఆర్ రెహమాన్ స్పందింస్తూ.. ‘ నాకు చాలా సంతోషంగా ఉంది. బాఫ్టాతో పని చేస్తూ సినిమాలు, ఆటలు, టీవీ రంగాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచే వారిని గుర్తించడం కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాను’ అని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm